ప్రతి ప్రభుత్వానికి కచ్చితంగా సలహాదారులు ఉంటారు. ముఖ్యమంత్రి ఆ సలహాదారుల దగ్గర అంతా చర్చించగా తర్వాత క్యాబినెట్ తో మాట్లాడాక ప్రతి నిర్ణయం రాష్ట్రంలో అమలు అవుతుంది. ఎక్కడా కూడా ఆ నిర్ణయం అమలు కాకముందు న్యాయస్థాన సమస్యలు రాకుండా అన్నీ చర్చించుకుంటారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు చాలావరకూ న్యాయస్థానాలలో మొట్టికాయలు పడుతున్నాయి.
రాజధాని భూముల విషయంలో మరియు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇంకా అనేక విషయాలలో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వెయ్యడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించే లాయర్ కూడా లేకపోవడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ప్రతిపక్షాల నుండి వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే క్రమంలో పార్టీలో కూడా మీరు తీసుకున్న నిర్ణయాలే న్యాయస్థానంలో విలువ లేకుండా పోతున్నాయి అంటూ మరో పక్క సూటిపోటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నట్టు వైసీపీ పార్టీలో టాక్.
దీంతో క్యాబినెట్ మరియు సలహాదారుల దగ్గర తీసుకున్న నిర్ణయాలు కూడా సరిగ్గా అమలు కాకుండా తలనొప్పి ఎక్కువ తెచ్చి పెట్టడంతో జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎటువంటి సమస్య అయినా న్యాయస్థానంలో పర్ ఫెక్ట్ గా డీల్ చేయగలిగే లాయర్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరపున న్యాయస్థానంలో వాదించే లాయర్ల పనితనం ఏమీ అంత గొప్పగా లేదని అందువల్ల జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.