ఉద్యోగుల వయో పరిమితిపై ప్రభుత్వ అధికారుల క్లారిటీ

-

‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసుగా’ అంటూ వివిధ వార్తా పత్రికలూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ కానీ లేదని స్పష్టం చేశాయి. ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news