సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాటన్నా చెబుతున్నారా : హరీష్ రావు

-

మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా కరీంనగర్‌లో రోడ్ షోలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…కాంగ్రెస్ వందరోజుల పాలనలోనే ప్రజలకు ఎన్నో కష్టాలు వచ్చాయి.. మంచినీళ్లు సరిగ్గా రావడం లేదు.. ఎన్నికల హమీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేశారు అని మండిపడ్డారు.

బాండు పేపర్లు రాసిచ్చి మరీ మోసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హమీలు నెరవలేరలేదు.. రూ. 4 వేల పింఛన్ ఊసే లేదు.. నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారని అడిగితే ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతున్నారు అని ఆరోపించారు . మాట తప్పిన రేవంత్ రెడ్డి..ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నీకు సురుకు పెడతారు అని హెచ్చరించారు. సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాటన్నా చెబుతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌వి ప్రజలను ఉద్ధరించే మాటలు కావు, ఉద్దెర మాటలు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదు, హామీలు అమలు చేయరు అని విమర్శించారు. కేసీఆర్ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు రేవంత్.. నువ్వు చెడ్డి  గ్యాంగ్ వెంట తిరిగినవా.. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news