పదో తరగతి ఫలితాలు గంటపాటు వాయిదా.. ఎందుకంటే?

-

నేడు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ముందుగానే ప్రకటించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్నారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన ఆయన..అక్కడే కంకిపాడులో జరుగుతున్న దేవినేని ఉమ కుమారుడి పెళ్లికి హాజరయ్యారు.

ఈ కారణంగా పదోతరగతి ఫలితాలను గంట పదిహేను నిముషాల పాటు విద్యాశాఖ అధికారులు వాయిదావేశారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదోతరగతి ఫలితాలు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. మొదట మధ్యాహ్నం 1 గంటలకు అని చెప్పిన విద్యాశాఖ అధికారులు.. సీఎం వివాహా శుభకార్యానికి వెళ్లిన కారణంగా గంట పదిహేను నిముషాల పాటు ఫలితాలు వాయిదా వేయడంపై పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news