కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులను కాదని.. అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని నిజమైన అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో గోల్‌మాల్ జరుగుతుందని ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మధిర నియోజకవర్గం గోవిందాపురం(ఎల్)గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మాత్రమే ఇళ్లు మంజూరు చేయడం ఏంటంటూ, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గ్రామస్తుల మండిపడుతున్నారు.