కోతులు మాములుగానే ఖతర్నాక్ అన్న సంగతి తెలిసిందే.. భూమ్మీద ఉండే తెలివైన జంతువు అంటే ఇదే.. తెలివి తక్కువ జంతువు కూడా ఇదే.. పొట్ట నింపు కోవడం కోసం ఎన్నో జిమ్మిక్కులు చేసి మరీ ఆహారాన్ని సంపాదించు కుంటుంది.. మనుషుల దగ్గరున్న ఆహారాన్ని దొంగిలించడానికి తెలివైన మార్గాలను ఎంచుకుంటాయి.
కొన్ని సార్లు కోతులు జనాల వద్ద నుండి స్మార్ట్‌ఫోన్‌లు, సన్‌గ్లాసెస్, ఇతర వస్తువులను లాక్కోని పారిపోవడం వాటి కోసం ఆ వ్యక్తులు పడే పాట్లు సోషల్ మీడియా లో అనేకం చూస్తుంటాం.. ఇక కోతులు తమకు కావాల్సిన దానికోసం పక్కాగా స్కేచ్ వేసుకుంటాయి.. కరెక్ట్ టైమ్ చూసి గురిపెట్టిన వస్తువును చోరీ చేస్తుంటాయి.. ఆ చోరీ ఎప్పుడూ ఫెయిల్ కాదు. రెప్పపాటు లో చోరీ జరిగిపోతుంది. అలా ఆ వానరం చేస్తున్న చోరీకి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..
కోతులు దేవాలయాలు, పార్కుల వద్ద పర్యాటకుల నుండి ఆహారాన్ని దొంగతనం చేయడం చూస్తుంటాం. ఇక్కడ వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి బ్యాక్ ప్యాక్‌లో ఉన్న ఆహారాన్ని దొంగతనంగా తీసేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి కోతి వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. వీపుకు బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు.. పాపం అతనికి తెలియదు.. అక్కడ దొంగ కోతులు ఉన్నాయని.. అక్కడికి రెండు కోతులు వచ్చాయి. అందులో ఓ కోతి బ్యాగ్ వైపు వెళ్ళి చాలా జాగ్రత్తగా జిప్ తీసింది.అందులో ఏం లేదు.. దాంతో ఇక మరో జిప్ తీసింది. అయినప్పటికీ అతను అలానే ఉన్నాడు. అందులో దానికి యాపిల్ దొరికింది. ఇంకేముంది దాన్ని పట్టుకొని అక్కడి నుంచి ఉడాయించింది.. అలా వెళ్ళి రెండు పంచుకొని తిన్నాయి. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది…