డబ్బులు ఉంటే ఈమద్య పిల్లలు కనకుండా కోన్ని జంటలు ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారు. మీ తల్లిదండ్రులు అనాలనే అనుకుంటే వారు పుట్టేవారా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. జనాభా పెరుగుదల ప్రస్తుతం చాలా అవసరం. ప్రతి జంట ఇద్దరు పిల్లల్ని కనేలా చూసుకోండి.. త్వరలో కుప్పాన్ని స్వఛ్చ కుప్పంగా మారుస్తాం. 150 పైగా సేవలను వాట్స్ అప్ ,అన్ లైన్ ద్వారా పోందే విదంగా యాప్ ను రూపొందిస్తున్నాం. ప్రతి ఇంటిలోను ఒక పారిశ్రామిక వేత్త పుట్టుక రావాలీ.
అలా వచ్చేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎఐ ద్వారా మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. సీఎం పేరు, పీఎం పేరు సహా ఏ సమాచారం కావాలన్న ఎఐ ఇస్తుంది. ప్రతి జిల్లాకు ఒక విజన్ రూపొందిస్తాం. వైసిపి ప్రభుత్వంలో వేలాది ఎకరాలను దోచుకున్నారు. అరవై శాతం భూ సమస్యలు నాకు ఫిర్యాదుల రూపంలో వస్తున్నాయి. ఐదేళ్ళలో కుప్పాన్ని ఊహించని అభివృద్ధి చేస్తాను. అన్ స్టాపబుల్ గా కుప్పాన్ని అభివృద్ధి జరుగుతుంది. కుప్పంలో త్వరలో విమానాశ్రయంకు శంకుస్థాపన చేస్తాను అని చంద్రబాబు పేర్కొన్నారు.