తిరుపతిలో జనసేన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించగా.. నగరంలోని యాభై డివిజన్ ల నుంచి జనసేన నాయకుల హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతిలో జనసేన బలోపేతం కావాల్సి ఉంది. డివిజన్ కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. సంక్రాంతి తరువాత అన్ని డివిజన్లలో జనసేన పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తాం.. ప్రజల సమస్యలను డివిజన్ల వారీగా తెలుసుకుని పరిష్కరిస్తా అన్నారు.
అలాగే కార్పోరేషన్ ఎన్నికలు ఏడాదిలో రానున్నాయి. కార్పోరేషన్ ఎన్నికలే కాదు ఏ ఎన్నిక వచ్చినా జనసేన తన బలాన్ని చూపాలి. కానీ వైసీపీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నేతలను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుని వైసిపి గెలిచింది. ప్రజాబలంతో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల నిర్ణయం మేరకు ఎవరికి ఎన్ని సీట్లు అనే నిర్ణయం ఉంటుంది. జనసైనికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటా.. రాయలసీమలో జనసేన బలోపేతానికి కృషి చేస్తా అని ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.