నేడు దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ఉంటుంది. గత కొన్ని రోజులుగా దేవాదాయ శాఖ పరిధిలో జరిగిన సంఘటనలపై సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఘటన నేపథ్యంలో భక్తుల భద్రత, ఇతర అంశాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇక అటు సింహాచలం గోడ దుర్ఘటనలో బాధ్యులు సస్పెండ్ అయ్యారు. ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆలయ ఈవో కె.సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ సహా పలువురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.