సీఎం చంద్రబాబుకు షర్మిల సంచలన లేఖ..!

-

తెలుగు ప్రజల మనోభావాలను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దెబ్బ తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. లంచాల కోసం ఏపీని జగన్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారీ కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని వైఎస్ షర్మిల అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం లక్షా 50 వేల కోట్లు రూపాయలు.. కాబట్టి వెంటనే డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version