ఇక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించడానికి కోవిడ్ -19 నెగటివ్ సర్టిఫికేట్ అవసరం లేదని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ బుధవారం అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఠాకూర్, ఈ చర్య వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడుతుందని, ఇప్పుడు ఎక్కువ మంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కు రాగలుగుతారని ఆయన అన్నారు. “ఇప్పుడు రాష్ట్రం తన సరిహద్దులను తెరిచినందున, రాష్ట్రంలోకి ప్రవేశించడానికి మరియు తిరిగి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారు.
పర్యాటక వ్యాపారం దీని తరువాత ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేసారు. రుతుపవనాల తరువాత, వర్షాకాలం తర్వాత ఇక్కడ పర్యాటకుల రాక ప్రారంభం కావడంతో పర్యాటకం ప్రారంభమవుతుంది,” అని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంబంధిత భద్రతా ప్రోటోకాల్స్ మరియు నిబంధనలను పాటించాలని ప్రతి ఒక్కరికి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఐదు నెలలకు పైగా సరిహద్దులను మూసివేసిన తరువాత ఇ-పాస్ లేకుండా అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతి ఇచ్చింది.