బీహార్ సిఎం నితీష్ కుమార్ లాక్ డౌన్ విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై తలమునకలు అవుతున్నారు. అక్కడ కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంపై ఇప్పటికే సిఎం ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అత్యవసరంగా 16 రోజుల లాక్ డౌన్ ని ప్రకటించారు. అయినా సరే కేసుల వ్యాప్తిలో మార్పు లేదు. రోజు మూడు వేలకు మించి కేసులు నమోదు అవుతూ ఉన్నాయి.
దీనితో బీహార్ లో లాక్ డౌన్ ని పెంచే యోచనలో ఆయన ఉన్నారట. బీహార్లోని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పని చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. బీహార్‌లో అన్ని విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు మూసి వేసే ఉన్నాయి. బీహార్ ప్రభుత్వం జూలై 30 న లాక్ డౌన్ విధించింది. కరోనా వ్యాప్తిపై విపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి.