పౌర సేవల్లో గొప్ప విప్లవం తెచ్చాం: సీఎం జగన్

-

జిల్లాల పెంపుతో ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయని CM జగన్ తెలిపారు. ‘15,004 గ్రామ/ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. సచివాలయాల్లో 600కు పైగా సేవలు అందిస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున 2.60 లక్షల మంది పనిచేస్తున్నారు. పౌర సేవల్లో ఇది గొప్ప విప్లవం. దేశంలోనే తొలిసారిగా గ్రామాల్లో 10,778 RBKలు ఏర్పాటు చేశాం. రైతులను చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ గ్రామాల్లోనే ఉంది’ అని వెల్లడించారు.

 

అలాగే.. 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను సీఎం జగన్‌ బుధవారం విడుదల చేశారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ జవహర్‌ రెడ్డి తదితరులతో కలిసి ఈ సర్వే నివేదికను జగన్‌ విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజరుకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని తెలిపారు. ”వ్యవసాయం లో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వద్ధి నమోదైంది. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివద్ధి కనిపిస్తోంది. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ. ఏపీ అభివద్ధి 16.2 శాతం నమోదైంది. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివద్ధి సాధించాం. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి” అని విజరుకుమార్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version