రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో సీరియస్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడ గేటు వే హోటల్ లో జరిగిన ది హిందు ఎక్స్లెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు ఇంగ్లీష్ లగ్జరీ కాదు తప్పనిసరి అన్నారు జగన్. స్కూల్స్ లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
దేశంలో అక్షరాస్యత సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనుకబడి ఉందన్న ఆయన, ఇంగ్లీష్ అనేది చాలా అవసరమని అన్నారు. మన ఫోన్లు కంప్యూటర్లు ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయని జగన్ అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు గాను చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇంగ్లీష్ చాలా అవసరమని చెప్పిన జగన్… ఇంగ్లీష్ రావాల్సిందే అన్నారు.
మంచి ఉదయం కావాలి అంటే ఇంగ్లీష్ చాలా అవసరమని అన్నారు. స్కూల్ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచామని జగన్ అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రిలాంటి వాడు అన్నారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెలుగు మీడియం స్కూల్ కి పంపగాలనా…? అని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పిల్లలను స్కూల్ కి పంపే విధంగా తల్లులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.