మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా రేట్లు పెంచాం : సీఎం జగన్

-

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మద్యం విక్రయాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే మందు పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచామని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పూర్తిగా బెల్టుషాపులను తొలగించామని చెప్పారు. అంతే కాకుండా మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకల్లా క్లోజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తమ చర్యల కారణంగానే గత ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

jagan

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎక్కడా కనిపించని బ్రాండ్ ల మద్యం బాటిల్లు, బీర్లు దర్శనమిస్తున్నాయి అని అనేకసార్లు ప్రతిపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీఎం కు సంబంధించిన వారే మద్యం బిజినెస్ చేస్తున్నారని వారి కంపెనీల నుండే ఈ బ్రాండ్ లు వస్తున్నాయని ప్రతిపక్షాలు అనేకసార్లు ఆరోపణలు చేశాయి. మద్య నిషేధం చేయాలంటే ఒకేసారి చేయొచ్చని కూడా ఆరోపించాయి. మరి తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version