ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం కారణం గా భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల వాగులు ఉప్పోంగుతున్నాయి. ముఖ్యం గా చిత్తూర్, నెల్లూర్, కడప జిల్లాలలో అతి భారీ వర్షలు పడుతున్నాయి. ఈ మూడు జిల్లాలలో రహదారుల పై నే వరదలు వస్తున్నాయి. దీంతో వాహనాల రాప పోకల కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలా ఈ మూడు జిల్లాలలో చెట్లు, విద్యుత్ స్థంభాలు కింద పడుతున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలాగే తిరుపతి నగరంలో కూడా భారీ వర్షలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు కాలనీలలో వర్షపు నీరు ఇల్లలోకి వస్తున్నాయి. గత 50 ఏళ్ల లో ఎప్పుడు కూడా ఇలాంటి వర్షాలు చూడలేదని తిరుపతి నగర ప్రజలు అంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి కే పలు జిల్లా లో విద్యాసంస్థల ను కూడా మూసివేశారు.