మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌..

-

ఈ మధ్యకాలంలో సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా సరే చాలామంది తమ బాధలు నేరుగా ఆయనతోనే విన్నవించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చూశాం. గతంలో సీఎం జగన్ తన కాన్వాయ్ ఆపి మరీ బాధితుల కష్టాలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపేవారు. అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ప్రారంభోత్స‌వానికి శుక్ర‌వారం విజ‌య‌న‌గ‌రం విచ్చేసిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వివిధ అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ బాధితులు క‌లిశారు. దారిద్య్ర రేఖ‌కు దిగువ కుటుంబాల‌కు చెందిన వార‌మ‌ని వైద్యానికి, చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాల‌ని విన్నవించుకున్నారు.

వారి స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రితో మొర పెట్టుకున్నారు. ఆయ‌న బాధితుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా విని వారితో కాసేపు మాట్లాడారు. వారిలో మ‌నోధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు. బాధితుల్లో ఒక‌రు ముఖ్య‌మంత్రిని చూడ‌గానే బోరున విల‌పించ‌గా వెంట‌నే స్పందించిన ముఖ్య‌మంత్రి బాధితుడి భుజంపై చేసి ఓద‌ర్చారు. ఏం కాదులే మేమున్నామ‌ని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

వైద్య క‌ళాశాల ప్రారంభోత్స‌వం అనంత‌రం తిరుగు ప‌య‌ణంలో హెలీప్యాడ్ వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రిని గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న పూస‌పాటిరేగ గ్రామానికి చెందిన‌ చిన్నారి తోంప‌ల లేఖ‌న‌, గంట్యాడ మండ‌లం కొర్లాం గ్రామానికి చెందిన‌ బోన్‌మేరో వ్యాధిగ్ర‌స్థుడైన దూరి భానుప్ర‌సాద్, శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం దేర‌శం గ్రామానికి చెందిన పోలియో వ్యాధిగ్ర‌స్థుడు పిల్లా శంక‌ర రావు, అనుకోని ప్ర‌మాదంతో వీల్ ఛైర్ కు ప‌రిమిత‌మైన‌ సి. శిగ‌డాం మండ‌లం నిద్దాం గ్రామానికి చెందిన చౌద‌రి గ‌ణేశ్ క‌లిశారు. స‌హాయాన్ని అభ్య‌ర్థించారు. స్పందించిన ముఖ్య‌మంత్రి ఒక్కొక్క‌రికి రూ.1 ల‌క్ష చొప్పున న‌లుగురికీ రూ.4 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయాన్ని అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మిని ఆదేశించారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని క‌లిసిన అనారోగ్య బాధితుల‌కు త‌క్ష‌ణ‌మే ఆర్థిక స‌హాయం అందించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ తీవ్ర కృషి చేశారు. క‌లెక్ట‌రేట్ ఏవోకు స్వ‌యంగా ఫోన్ చేసి నిమిషాల వ్య‌వ‌ధిలో చెక్కులు సిద్ధం చేయించి హెలీప్యాడ్ వ‌ద్ద‌కు ర‌ప్పించారు. అక్క‌డిక‌క్క‌డే ఆమె సంత‌కాలు చేసి ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా అందించేందుకు ప్ర‌య‌త్నించిగా… నీ చేతుల మీదుగానే ఇచ్చేయ్ త‌ల్లి అని ముఖ్య‌మంత్రి చిరున‌వ్వుతో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version