టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై ఏపీ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టాలీవుడ్‌ని విశాఖకు కూడా విస్తరించండని.. విశాఖలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు. తెలంగాణతో పోలిస్తే ఇండస్ట్రీకి 60 శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తుందని చెప్పారు. విశాఖలో జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని వెల్లడించారు.
సినిమా ప్రముఖులు కనీసం 20శాతం షూటింగులు..ఏపీలో చేస్తామని చెప్పారన్నారు సిఎం జగన్. విశాఖను మనది అనుకొని భావించాలని.. ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకటే రేటు అని స్పష్టం చేశారు. దీని కోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని.. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా నాతో పంచుకున్నారని వెల్లడించారు.