పరిశ్రమల స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు ప్రోత్సహించేలా ఉండాలి : సీఎం జగన్‌

-

విశాఖే పరిపాలన రాజధానిగా చర్చ సాగుతున్న వేళ ముఖ్యమంత్రి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ పై సీఎం జగన్ ప్రాధమిక సమావేశం నిర్శమించారు. మెరుగైన పారిశ్రామిక పాలసీ ఖరారు దిశగా అధికారులకు సూచనలు చేసారు. న్యూ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీలో మార్కెటింగ్‌ టై అప్‌ విధానంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌.. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను చేయి పట్టుకుని నడిపించేలా పారిశ్రామిక విధానం ఉండాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు ప్రోత్సహించేలా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

మార్కెటింగ్ టైఅప్ విధానంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు సీఎం జగన్. అంతర్జాతీయ టైఅప్ లతో ఎంఎస్ఎంఈలతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు సీఎం జగన్. ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. సరైన మార్కెటింగ్ చూపిస్తే పరిశ్రమలు మరింతగా రాణిస్తాయని తెలిపారు సీఎం జగన్. కాన్సెప్ట్, కమిషనింగ్, మార్కెటింగ్ లో చేయూతనివ్వాలని పేర్కొన్నారు. అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్ గా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని స్పష్టం చేశారు సీఎం జగన్. స్టార్టప్ ల కోసం విశాఖలో పెద్ద భవనం నిర్మించాలని చెప్పారు. ఆ భవనం 3 లక్షల చదరపు అడుగులతో మంచి లొకేషన్ లో ఉండాలని నిర్దేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version