విజయవాడ: గొల్లపూడిలో ‘దిశ’మొబైల్ యాప్ అవగాహన సదస్సు నిర్వమించారు. ఈ సదస్సు లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీతానగరం ఘటన గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. ఆ సంఘటన తనను కలచివేసిందని చెపపారు. దిశ యాప్ 4 అవార్డ్‌లు సాధించిందని పేర్కొన్నారు. 15 లక్షలు మంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్‌ను కోటి మంది డౌన్లోడ్ చేసుకోవాల్సిఉందన్నారు.
ఎస్ఓఎస్ బటన్ నొక్కిన లేక ఫోన్ షేక్ చేసిన పోలీస్‌లు వచేస్తారని వెల్లడించారు. రాష్ట్ర హోంమంత్రి, డిప్యూటీ సీఎం ఒక మహిళ, ఆమె కూడా ఈ యాప్‌ను తీసుకురావడంలో కృషి చేశారని చెప్పారు. ట్రాక్ మై ట్రావెల్ యాప్‌లో అన్ చేస్తే మీ ట్రావెల్ డీటెయిల్స్‌తో పాటు వెళ్లాల్సిన మార్గం తెలుస్తుందని సీఎం జగన్ తెలిపారు.దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ తెలిపారు.