పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు..!

-

  ఇవాళ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభకు హాజరై ప్రసంగించారు సీఎం జగన్. పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నారని అడగడు. నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాపెయినర్లు అని స్పష్టం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ఫ్యాకేజీ స్టార్ తనకు సైకిల్ సీటు కావాలని అడగడు.. ఎందుకు నాకు ఇన్ని తక్కువ సీట్లు ఇస్తున్నావని క్వశ్చన్ చేయడు. కావాలంటే తాను టీ గ్లాస్ బాబుకే ఇచ్చేస్తాడు. 

 నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రానీ పార్టీ అటువైపు ఉందన్నారు.  విభేదించినట్టు డ్రామా ఆడమంటే ఆడతాడు అని సెటైర్లు వేశారు.  మూడు పార్టీలు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజలు ఆశీర్వదించడంతోనే మన ఫ్యాన్ కి పవర్ వస్తోంది. చంద్రబాబు సైకిల్ కి చక్రాలే లేవు. తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికి ఆయనకు ఇతరుల సహకారం కావాలి. మళ్లీ జగన్ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version