టార్గెట్ 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ కీలక ప్రకటన

-

క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో తాజాగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి పార్టీకే పెద్ద పీట ఇవ్వనున్నట్లు… టార్గెట్ 2024 లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్.

ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని.. దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ప్రతి నెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నామని.. ఇవి జాగ్రత్తగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదని వెల్లడించారు వైఎస్ జగన్.

జిల్లాకమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తికావాలని.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలని ఆదేశించారు. మహిళా సాధికారితకోసం ఈప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని.. పథకాల్లో సింహభాగం వారిదేనని పేర్కొన్నారు. బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా వారికి ప్రాధాన్యత ఉండేలా చూసుకోండని ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version