విశాఖపట్నం పర్యటనలో తన కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్నారు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించి శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా డీఆర్ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంకి రామారావు, సుబ్బలక్ష్మి కోరారు.
తమ కుమారులిద్దరూ సికిల్‌బెడ్ థలసేమియాతో భాదపడుతున్నారని, వారి శస్త్రచికిత్సకు ప్రభుత్వం సాయం అందించాలంటూ ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు రామారావు దంపతులు. పిల్లల ఆరోగ్య పరిస్ధితి చూసి చలించిన సీఎం వైఎస్ జగన్… వారికి అవసరమైన సాయం చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్‌ను కలిసి తన సమస్య చెప్పుకున్న పెదవాల్తేరుకు చెందిన ధర్మాల త్రివేణి, కొద్దిరోజుల క్రితం తన భర్త హత్యకు గురయ్యాడని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని వివరించారు త్రివేణి. అటు త్రివేణి కుటుంబానికి తగిన న్యాయం చేయమని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.