ఈ యూనివర్సిటీలన్నీ ఫేక్‌ అని నిర్థారించిన యూజీసీ.. టాప్‌లో దిల్లీ.. ఏపీలో ఒకటి..!

-

దేశవ్యాప్తంగా 21 యూనివ‌ర్సిటీల‌ను నకిలీ వ‌ర్సిటీలుగా యూజీసీ(University Grants Commission – UGC) నిర్ధారించింది. ఈ యూనివ‌ర్సిటీల్లో అత్య‌ధికం ఢిల్లీలోనే ఉండటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఢిల్లీ తరువుతా యూపీలో కూడా నకీలి వర్సిటీలు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో ఉన్నత చదువుకోసం..అధికంగా వెళ్లే ప్రాంతాల్లోనే నకిలీ వర్సిటీలు ఉండటం గమనార్హం..ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, పుదుచ్చేరి ఆఖరికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లోనూ న‌కిలీ వర్సిటీలున్నాయ‌ని యూజీసీ వెల్ల‌డించింది. ఈ వ‌ర్సిటీలు యూజీసీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయ‌ని తెలిపింది.

యూజీసీ నిర్ధారించిన మొత్తం 21 న‌కిలీ వ‌ర్సిటీల్లో ఎనిమిది ఢిల్లీలో ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 4, ప‌శ్చిమ‌బెంగాల్, ఒడిశాల్లో రెండు చొప్పున‌, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, పుదుచ్చేరి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లో ఒక్కొక్క‌టి చొప్పున న‌కిలీ యూనివ‌ర్సిటీల‌ను యూజీసీ గుర్తించింది. ఈ వ‌ర్సిటీలు ఇచ్చే డిగ్రీల‌కు ఎటువంటి గుర్తింపు లేద‌ని స్ప‌ష్టం చేసింది. డిగ్రీల‌ను ప్ర‌దానం చేసే అర్హ‌త ఆ యూనివ‌ర్సిటీల‌కు లేద‌ని తెలిపింది. ఈ వ‌ర్సిటీల‌న్నీ గుర్తింపు లేని విద్యా సంస్థ‌లుగా పేర్కొంది..

ఏపీలోని క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివ‌ర్సిటీ కూడా జాబితాలో ఉంది…
యూజీసీ ప్ర‌క‌టించిన న‌కిలీ యూనివ‌ర్సిటీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక విశ్వ‌విద్యాల‌యం కూడా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌`క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివ‌ర్సిటీ(Christ New Testament Deemed University) కి యూజీసీ గుర్తింపు లేద‌ని, డిగ్రీల‌ను ప్ర‌దానం చేసే అర్హ‌త ఆ యూనివ‌ర్సిటీకి లేద‌ని యూజీసీ స్ప‌ష్టం చేసింది.

ఢిల్లీలో నకిలీ వర్సిటీలు ఇవే..

All India Institute of Public and Physical Health Sciences (AIIPPHS),
Commercial University Ltd.,
United Nations University,
Vocational University,
ADR-Centric Juridical University,
Indian Institution of Science and Engineering,
Viswakarma Open University for Self-employment
Adhyatmik Vishwavidyalaya (Spiritual University)

క‌ర్నాట‌క‌లో Badaganvi Sarkar World Open University Education Society
కేర‌ళ‌లో t. John’s University, Kishanattam
మ‌హారాష్ట్ర‌లో Raja Arabic University, Nagpur
పుదుచ్చేరిలో ree Bodhi Academy of Higher Education న‌కిలీవ‌ని తేల్చింది.
ఒడిశాలో The Nababharat Shiksha Parishad and North Orissa University of Agriculture and Technology
ప‌శ్చిమ‌బెంగాల్‌లో ndian Institute of Alternative Medicine and Institute of Alternative Medicine and Research are the fake university ల‌ను ఫేక్ వ‌ర్సిటీల‌ని నిర్ధారించింది.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో Gandhi Hindi Vidyapith, Prayag; National University of Electro Complex Homeopathy, Kanpur; Netaji Subhash Chandra Bose University and Bhartiya Shiksha Parishad, Bharat Bhawan వ‌ర్సిటీల‌కు గుర్తింపు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version