కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడంపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే…. 104 ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 133 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు సీఎం వైయస్.జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే…. వర్చువల్ గా ప్రారంభించారు సీఎం జగన్. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్ ఆక్సిజన్ తయారీ యూనిట్ల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం…. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో రాష్ట్రం స్వావలంబన సాధించింది.
ఆస్పత్రుల ఆవరణలోనే ఈ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్ ను… పైపు లైన్ల ద్వారా నేరుగా రోగులకు అందించే ఏర్పాటు చేశారు అధికారులు. సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్‌తో నింపే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు ఏపీ వైద్య శాఖ అధికారులు. సెకెండ్ వేవ్ కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. 133 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు సీఎం వైయస్.జగన్.