మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. తాజాగా వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ రిఫరల్, సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగం కావాలన్నారు.
ఆరోగ్య శ్రీ సేవలపై ఎలాంటి ఫిర్యాదులున్నా చేయడానికి ఆరోగ్య శ్రీ కార్డులపై ఫిర్యాదు నంబర్ ఉంచాలన్న సీఎం…ఎవరైనా లంచాలు అడిగినా ఈ నంబర్‌కు చేయాలంటూ కార్డుపై ముద్రించాలని పేర్కొన్నారు. ఎనీమియా కేసులను సంపూర్ణ పోషణ ప్లస్‌తో అనుసంధానం చేయాలన్న సీఎం జగన్… పోషణ ప్లస్‌ద్వారా వారికి పౌష్టికాహారం అందించేలా చూడ్డం, అది అందుతుందా? లేదా? అన్న పర్యవేక్షణ కూడా చేయాలని కోరారు. అలాగే మూడో విడతలో మిగిలిన వారికి వైఎస్‌ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్.