దేశ వ్యాప్తంగా రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని ఈ మాసం గొప్ప సందేశం ఇస్తుందని తెలిపారు. అత్యంత నియమ నిష్టలతో ఉపవాసం ఉండే ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
ఇక ఆకాశంలో నెలవంక కనిపించడంతో రేపటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ముస్లిం పెద్దలు ప్రకటించారు. నెల రోజుల పాటు ఉండే రంజాన్ ఉపవాస దీక్షలను అత్యంత పవిత్రంగా ముస్లింలు భావిస్తారు.