గుజరాత్ టైటాన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…నెంబర్ వన్ బౌలర్ రీ ఎంట్రీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ప్రారంభం కాకముందే గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. కెప్టెన్ హార్దిక్ పాండ్యను ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా ముంబై ఇండియన్స్ బ్రాంచెస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక హార్దిక్ స్థానంలో టీమిండియా యువ బ్యాట్స్మెన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.

స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 17 వ సీజన్ కి దూరం అయ్యాడు.ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు తాజాగా ఒక శుభవార్త అందింది.వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ , ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ వెన్ను గాయం నుంచి కోలుకున్నాడు. చివరిసారిగా ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ఇండియా వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఆడాడు. గాయం కారణంగా దాదాపు 5 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న రషీద్ ఖాన్ తాజాగా పొట్టి క్రికెట్ ఫార్మాట్ కి ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గాయం నుండి పూర్తిగా కోలుకున్న ఈ లెగ్ స్పిన్నర్.. షార్జాలో మార్చి 15 నుండి ఐర్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఫ్గనిస్తాన్ తరపున ఆడుబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version