విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు – సీఎం జగన్

-

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ చాలా ఘనంగా జరుగుతోంది. అయితే.. వినాయక చవితి నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. శుభాకాంక్షలు చెప్పారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడని తెలిపారు సీఎం జగన్‌. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు.

cm jagan

ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. ఇక అటు వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని సిఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version