ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తాజా పరిస్థితులపై తనదైన కోణంలో కామెంట్ లు పెడుతూ దుమారం రేపుతుంటారు. ఇక అలా ఆయన చేసిన ఎన్నో కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా ఆంటీ అనే పదం నేషనల్ ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు అంకుల్ రంగంలోకి దిగారు.. బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ చూస్తుంటే యాంకర్ అనసూయ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. నిజానికి లైగర్ సినిమా విడుదల కావడం.. అనసూయ విజయ్ దేవరకొండ పై పరోక్షంగా ట్వీట్ చేయడం రచ్చకు దారితీసింది.
అంతేకాదు ఈమె అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ.. కర్మ వెంటాడుతుంది అంటూ చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయను విజయ దేవరకొండ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు ఆమెను ఆంటీ అని సంబోధిస్తూనే మరొక పక్క ఆమెను బాడీ షేమింగ్ కు గురి చేశారు. మరికొంతమంది చాలా అధ్వానంగా అనసూయను ఆంటీ ఆంటీ అంటూ పచ్చి బూతులు కూడా మాట్లాడారు.. మరోపక్క అనసూయ కూడా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై రిటర్న్ కౌంటర్ వేసింది. అంతేకాకుండా తట్టుకోలేక ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది అనసూయ.
Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. 😜 https://t.co/9fbRbXirbJ
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022