ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనం పై పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. దీని కోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని తెలిపారు. స్కూళ్లు, అంగన్‌వాడీలకు బియ్యాన్ని సరఫరా చేసే ముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని వెల్లడించారు.
నాడు– నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రత కోసం వాచ్‌మ్యాన్ నియమించాలని ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణ పై ఒక కాల్ సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. స్కూళ్ల నిర్వహణ పై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సూపర్ వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని పేర్కొన్నారు సీఎం జగన్.