మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్దిని కలుసుకున్నారు.
అంతకు ముందు ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిలు సీఎం కేసీఆర్ ని కలిశారు. సీఎం కేసీఆర్ కు పాదాభివందనాలు చేసిన మంత్రులు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతం సీఎం తో సహా.. మంత్రులు, అధికారులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు 2022-23 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్ రాష్ట్ర ప్రజలు, రైతులు, పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.