మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ “చాణక్య” వ్యూహం రచిస్తున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గంతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఫార్మ్ హౌస్ కేసులోని ఎమ్మెల్యేలను కూడా సీఎం కేసీఆర్ తన వెంట తీసుకుని వచ్చారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు.
నేటి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఫీల్డ్ లోనే ఉండాలని సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్యాలెండర్ వేసుకుని పని చేయాలని, నిత్యం ప్రజల్లోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు గట్టిగా ఏడాది ఉందని, అందరూ కష్టపడాలని సూచించారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు.. 100 ఓటర్లకు ఒక ఇన్ చార్జీని నియామకం చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం లోగా ఈ నియామకాలు చేపట్టాలని ఆదేశించారు.
CM #KCR at #TRS Party meeting pic.twitter.com/NAdDRHXAFb
— Sarita Avula (@SaritaTNews) November 15, 2022