ఒక్క రూపాయి తీసుకోకుండా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చాం : కేసీఆర్‌

-

ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శంఖారావాన్ని ప్రారంభించారు. వరుస సభలు నిర్వహిస్తున్నారు. కొన్నిగంటల క్రితం జడ్చర్లలో పర్యటించిన ఆయన తాజాగా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజలను బాసిసల్లా చూశారని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరెంట్ లేని పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నెంబర్‌గా నిలిపామని చెప్పారు. పర్ కేపిటల్ ఆదాయంలో దేశానికి రాష్ట్రం తలమానికంగా ఉందన్నారు.

పేదలందరినీ ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు. రైతులు, పట్టణ పేదలకు అండగా నిలిచామని తెలిపారు. ఒక్క రూపాయి తీసుకోకుండా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. పదేళ్లలో చాలా అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చాలా మంది వస్తారని.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద మొక్కులు మొక్కే వాళ్లు వస్తారని, కానీ బీఆర్ఎస్‌కు అండగా నిలబడాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను నిర్మిస్తామన్నారు. మంత్రి మల్లా‌రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు.

బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారనే విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానం గజ్వేల్ తోపాటు, కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారు. కేసీఆర్ పై బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే యోచనలో కాషాయ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని గతంలో చాలాసార్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పుడు తెరపైకి బండి సంజయ్ పేరు రావడం మరింత ఆసక్తిని రేపుతోంది. అలాగే కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీపై వార్తలు రావడం పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. త్వరలోనే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరి బండి సంజయ్ , విజయశాంతిలను కేసీఆర్ పై పోటీకి కాషాయ పెద్దలు దించే యోచనలో ఉన్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version