రేషన్ కార్డు దారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…! ఇక పై కార్డు దారులకు….

-

సీఎం కేసీఆర్ ఓ గొప్ప నిర్ణయంతో మన ముందుకు వచ్చారు. ఈ కష్టకాలంలో రేషన్ దారులకు ‘’వన్ నేషన్ వన్ రాషన్’’ అంటూ ప్రధాని మోడీ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ తరఫున ఇప్పటికే ఇస్తున్న నిత్యవసర సరకులను నవంబర్ వరకు ఇస్తామని ప్రకటించారు. ఇక ఈ పథకానికి అదనుగా తెలంగాణ సర్కార్ మరో ఐదు కిలోల బియ్యం జత చేసి నవంబర్ వరకూ ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఈ కష్టకాలంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇక సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. శ‌నివారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కొక్కరికి నవంబర్ వరకు 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తామని ప్రకటించిందని, కేంద్రం వాటాకు మరో 5 కిలోలు కలిపి ఈనెల నుంచి నవంబరు వరకు మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. రాష్ట్రం లో రాషన్ కార్డు దారుల సంఖ్య దాదాపుగా 87 లక్షల కుటుంబాలు. వారందరికి ఈ పథకం అమలవుతుందని ఆయన అన్నారు. దీంతో రాష్ట్రం లోని 2.79 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారు అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version