BREAKING : ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించినట్టు : సీఎం కేసీఆర్‌

-

ఒడిషా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ నేడు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్‌ను మార్చే సంకల్పంతోనే బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్బవించామని సీఎం కేసీఆర్ అన్నారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నమని ఆయన అన్నారు. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ ను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. న‌వ నిర్మాణ్ కృష‌క్ సంఘ‌ట‌న్ క‌న్వీన‌ర్ అక్ష‌య్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడం సంతోష‌క‌రమన్నారు.

దేశంలోని క్రియాశీల నాయ‌కుల్లో గ‌మాంగ్ ఒక‌రని పేర్కొన్నారు. రైతుల త‌ర‌పున గ‌మాంగ్ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారని చెప్పారు. గ‌మాంగ్ రాజ‌కీయ జీవితం మ‌చ్చ‌లేనిదని తెలిపారు. గ‌మాంగ్ చేరిక తనకు వేయి ఏనుగుల బ‌లాన్ని ఇచ్చిందన్నారు. అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దేశంలో వ‌న‌రులు ఎక్కువ ఉన్నాయన్నారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి చెంద‌డం లేదన్నారు. భార‌త్ త‌న ల‌క్ష్యాన్ని మ‌రిచింద‌ని ఆయన వెల్లడించారు. అమెరికా వెళ్లేందుకు దేశ యువ‌త త‌హ‌త‌హ‌లాడుతోందన్నారు. అమెరికా గ్రీన్ కార్డు వ‌స్తే సంబురాలు చేసుకుంటున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version