కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించింది : సీఎం కేసీఆర్

-

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు భువనగిరిలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని, ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలన్నారు కేసీఆర్. ఈ జిల్లాకు భగవంతుడి పేరును కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరుపెట్టుకున్నామని, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండె అని కేసీఆర్ అన్నారు.

పైళ్ల శేఖర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. పైళ్ల ఆధ్వర్యంలో తాను స్వయంగా వచ్చి దాదాపు 98 శాతం పూర్తైన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ అయిన నృసింహసాగర్‌ దేవుని పేరును పెట్టుకున్నామని, ఇది ప్రారంభమయ్యాక లక్ష ఎకరాలకు నియోజకవర్గమంతా నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని బస్వాపూర్ ప్రాజెక్టు దాదాపు పూర్తయిందన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం భువనగిరి అరాచక శక్తులను పెంచి పోషించిందని, వారు ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. అరాచక, కిరాతక మూకలను ఏ విధంగా బీఆర్ఎస్ ఏరిపారేసిందో మీ అందరికీ తెలుసునన్నారు కేసీఆర్. ఈ రోజు భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని, మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలన్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version