కరోనా తగ్గిందో లేదో.. పార్టీ నేతల్ని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్

-

హైదరాబాద్: ఇలా కరోనా తగ్గిందోలేదో వెంటనే పరిపాలనపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇటీవల కాలంలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల జరిగాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సభాపతులను ఎన్నుకునేందుకు పలువురు పరిశీలకులను నియమించారు.

కాగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. రెండు కార్పొరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల‌నూ, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శుక్రవారం జరగనుంది.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఖమ్మం కార్పొరేషకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి, కొత్తూరు మున్సిపాలిటీకి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నకిరేకల్ మున్సిపాలిటీకి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కరీంనగర్ మాజీమేయర్ రవీందర్ సింగ్, ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అచ్చంపేట మున్సిపాలిటీకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్చర్ల మున్సిపాలిటీకి సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి‌ని నియమించారు. వీరంతా గురువారం సాయంత్రంకల్లా ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news