మేడారం జాతరకు సంబంధించి.. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని.. అన్ని శాఖల సమన్వయంతో.. జాతర విజయవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేష్, డీజీపీ మహేందర్ రెడ్డి తో కలిసి.. ములుగు జిల్లా మేడారంలో ఆయన శనివారం పర్యటిచంఆరు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై సమీక్షించారు.
రూ.75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖల వారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖకు రూ. కోటి కేటాయించామని స్పష్టం చేశారు. 2020 జాతరలో 4 రోజు్లలో కోటీ 2 లక్షల మంది భక్తులు వచ్చారని.. ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందు నుంచే లక్షలలో వస్తున్నారని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ ఫ్రిబ్రవరి 18 వ తేదీన మేడారం జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని మంత్రులు ప్రకటన చేశారు.