ముస్లిమ్స్ కు సీఎం కేసీఆర్ శుభవార్త..29న ఇఫ్తార్ విందు

-

రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు.ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని సీఎం తెలిపారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచింది.సర్వమతాల సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది.

ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నదని.లౌకిక వాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తెలిపారు.కాగా ఈ విందుకు సుమారు 5 లక్షల మంది పేద ముస్లింలకు వస్త్రాలతో పాటు గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం అందించనుంది.ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తూన్న విషయాన్ని గుర్తుచేశారు సీఎం.

Read more RELATED
Recommended to you

Exit mobile version