మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఎన్నిక అనివార్యమైంది సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇది బిజెపి అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తులు మొదలు పెట్టాయి. ప్రజలు తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు.
ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి… దళిత బంధు పథకం మరియు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం లాంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ స్వయంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 16న హుజూరాబాద్ నియోజకవర్గం లో స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన చేయనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని శాల పల్లి లో… బహిరంగ సభ స్థలాన్ని మరియు ఇతర ఏర్పాట్లను తెలంగాణ మంత్రులు కొప్పుల ఈశ్వర్ మరియు గంగుల కమలాకర్ ఈరోజు పరిశీలించారు. సీఎం కేసీఆర్ సభకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నారు మంత్రులు.