కేసీఆర్‌ సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలకు ఆహ్వానం..

-

హైదరాబాద్‌లో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానించారు. ఈ నెల 17, 18 తేదీల్లో సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు ఆహ్వాన పత్రికను సీఎంకి అందజేసి, హాజరుకావాలని మంత్రి తలసాని ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి,దేవాలయ కమిటీ కోరారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు అర్చకులు, వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అయితే.. ఇప్పటికే.. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసం వద్ద ఈ నెల 17 న నిర్వహించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారి రీజినల్ జాయింట్ కమిషనర్ రామ కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version