ముందు సీఎం కేసీఆర్.. తరువాత జగన్.. యడ్యూరప్ప.. ఆయ‌న్ని కలిశారు.. ఎందుకు..?

-

సాధారణంగా స్వామీజీలను రాజకీయ నాయకులు కలవడం మామూలే. అయితే ఒకే సమయంలో ఒక స్వామీజీని మూడు రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు కలుస్తుండడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిలో నిర్వహించనున్న మహా సుదర్శన యాగంపై శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిసిన విషయం విదితమే. మంగళవారం స్వామీజీని హైదరాబాద్ శివారులో ఉన్న ముచ్చింతల్‌లో కేసీఆర్ కలిసి మహా సుదర్శన యాగం నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. యాగాన్ని పర్యవేక్షించాల్సిందిగా స్వామీజిని కేసీఆర్ కోరారు. అయితే నిన్న కేసీఆర్ చినజీయర్ స్వామి వద్దకు వెళ్లగా.. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పలు కూడా ఆయన్ను కలవనున్నారు.

సాధారణంగా స్వామీజీలను రాజకీయ నాయకులు కలవడం మామూలే. అయితే ఒకే సమయంలో ఒక స్వామీజీని మూడు రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు కలుస్తుండడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నిన్న కేసీఆర్, ఇవాళ జగన్, యడ్యూరప్పలు చినజీయర్ స్వామిని కలుస్తుండడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి కారణం ఏమిటా.. అని ఇప్పటికే చాలా మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

అయితే చినజీయర్ స్వామి ఆశీస్సులను తీసుకోవడం కోసమే ముగ్గురు సీఎంలూ ఆయన్ను కలుస్తున్నా.. దీని వెనుక ఇంకోటేదైనా కారణం ఉండి ఉంటుందేమోనని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎంలు కేసీఆర్, జగన్‌లు రెండు తెలుగు రాష్ర్టాల బాగు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఇక యడ్యూరప్ప మొన్నీ మధ్యే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడంతో సీఎం అయ్యారు. ఈ క్రమంలో ఈ ముగ్గురూ ఇలా ఒకేసారి చినజీయర్ స్వామిని కలవడం ఇప్పుడు మూడు రాష్ర్టాల్లోనూ చర్చనీయాంశమవుతోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version