సీఎం కేసీఆర్ పై అనుచిత పోస్టులు… ఆరుగురి అరెస్ట్

-

రాజకీయ నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేయడం.. వారిని దారుణంగా ట్రోల్ చేయడం ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువ అవుతోంది. ఆయా పార్టీల సోషల్ మీడియా గ్రూప్ లు, మద్దతుదారులు ఇలా చేస్తున్నారు. అయితే విమర్శించడం మంచిదే… కానీ ఇలా వాళ్లను అవమానపరుస్తూ ట్రోలింగ్ చేయడం మంచిది కాదు. గతంలో కూడా ఇలా చాలా సార్లు జరిగాయి.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ పై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమందిని అరెస్ట్ చేశారు. మార్ఫింగ్ చేసిన సీఎం కేసీఆర్ ఫోటోను వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఆరుగురిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ఖమ్మం జిల్లా కారెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ వ్యక్తి కేసీఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఖమ్మం కు చెందిన ఇద్దరికి పంపాడు. ఆ ఇద్దరు తమ స్నేహితులు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను గుర్తించిన ఓ టీఆర్ఎస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరుగురిని అరెస్ట్ చేసి, కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version