BREAKING : ఈ నెల 30న కేసీఆర్‌ బహిరంగ సభ..రెండు రోజుల పాటు అక్కడే !

-

BREAKING : మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులతో ప్రచారాన్ని హోరెత్తుస్తున్నాయి. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడమే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 30న బహిరంగ సభ.. నిర్వహించనుంది టీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. అంతేకాదు.. ఈ నెల 28 నే మునుగోడుకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 28 మరియు 29 తేదీల్లో.. మునుగోడులో సీఎం కేసీఆర్‌ రోడ్‌ షోలలో పాల్గొననున్నారు. అంటే ఈ లెక్కన సీఎం కేసీఆర్‌ రెండు రోజుల పాటు మునుగోడులోనే మకాం వేయనున్నారు. మునుగోడు లో ఎలాగైన టీఆర్‌ఎస్‌ విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎత్తుగడలు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version