రాబ‌డులు పెరిగి.. ఆర్థిక వ‌న‌రులు పెరిగాయి : సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించింద‌ని స్ప‌ష్టం చేశారు. తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయని, తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి ద్వారానే.. ఇవన్నీ సాధ్యమ‌వుతున్నాయన్నారు సీఎం కేసీఆర్‌. తద్వారా ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారని, వారికి మరింత నాణ్యమైన, ఉత్తమమైన సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులమీదనే వున్నద‌ని తెలిపారు సీఎం కేసీఆర్‌. పౌర సౌకర్యాల పెంపు కోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందంటే, మన ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సీఎం అన్నారు.

ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన‌ అవసరమున్నదని ఉద్యోగులతో కేసీఆర్ అన్నారు. ఒక నాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానలు తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా వుంటున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నుంచి బయటకు పోయిన వలసలు నేడు రివర్సయినయి. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసొచ్చి బతుకుతున్న పరిస్థితి వున్నది. స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగాయి. పరిపాలనా సంస్కరణలతో గడప గడపకూ పాలనను తీసుకపోతున్నం. ప్రభుత్వం కృషితో అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో అన్ని శాఖలల్లో పని పరిమాణం పెరిగింది. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమాన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి వుంటద‌ని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version