Breaking : రేపటి నుంచి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే 4 విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించారు. అయితే.. తాగాజా బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభంకానుంది. భైంసా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. రేపు ఉదయం నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మ అమ్మవారి ఆలయంలో సంజయ్ పూజలు చేసి.. భైంసా వెళ్లనున్నారు. 5 జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 20 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు. తొలిరోజు 6.3 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. రాత్రి గుండగామ్ సమీపంలో సంజయ్ బస చేస్తారు. మరోవైపు పాదయాత్ర కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ
నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కిలో మీటర్లకు పైగా నడిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version