కరీంనగర్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం అమలు కార్యాచరణపై మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం లో హుజురాబాద్ నేతలు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కరీంగనర్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడే బస చేశారు. ఇక మరికాసేపట్లో కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.
ఇక ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించేందుకు గాను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4,346 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలకు, ఇల్లందకుంట మండలంలోని 2,586 కుటుంబాలకు ఇప్పటి వరకు దళిత బంధు ఆర్థిక సహాయం అందింది.