ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 3న విచారణకు హాజరు కావాలని అక్బరుద్దీన్ ను ఆదేశించింది. నిర్మల్ లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని గతంలో ఓవైసీ పై కేసు నమోదు అయింది. ఆ తరవాత ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది.
అంతే కాకుండా ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2018 లో బలరాంనాయక్, దొంతి మాధవ రెడ్డి అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని వారిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు కోర్టుకు హాజరుకావాలని వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.