కేంద్రమంత్రి షెకావత్ సింగ్‌కు కేసీఆర్ ఫోన్… ఏం మాట్లాడారో తెలుసా?

-

హైదరాబాద్: కేంద్రమంత్రి షెకావత్ సింగ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న జలజగడంపై షెకావత్‌కు వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎన్జీటీ ఆదేశాలపై చర్చించారు. ఎత్తి పోతలప్రాంతానికి కృష్ణా బోర్డు బృందాన్ని పంపుతామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు షెకావత్ తెలిపారు. పనులు జరుగుతున్నాయో?. లేదో? కమిటీ పరిశీలిస్తుందని షెకావత్ చెప్పారు.

రాయలసీమలో ఎత్తి పోతల ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తమ వాటా ప్రకారమే ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని ఏపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ మంత్రులు అంటున్నారు.

 

ఇక ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై తమ ఆదేశాలను ధిక్కరించారని జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పనులు ఆపాలని, లేదంటే జైలుకు పంపుతామంటూ హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని ఎన్టీటీ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఎన్టీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని పాలమూరు జిల్లా రైతులు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ ధర్మాసనం ఎత్తిపోతల పనుల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version